ఈ ఏడాది పుష్పదే రూల్.. అంచనాలు పెంచుతున్న కొత్త అప్డేట్

ఈ ఏడాది పుష్పదే రూల్.. అంచనాలు పెంచుతున్న కొత్త అప్డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa2 The Rule). స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప పార్ట్1 భారీ విజయం సాధించిన నేపధ్యంలో పుష్ప2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది.

తాజాగా కొత్త సంవత్సరం నేపధ్యంలో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 2024RulePushpaKa(ఈ ఏడాది పుష్పదే రూల్) అని చెప్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు.. ఈ చిన్న యాష్ టాగ్ డైలాగ్ తో అంచనాలు కూడా భారీగానే పెంచేస్తున్నారు. ఇప్పటికే పుష్ప2పై భారీ బిజినెస్ జరుగుతోంది. అది కూడా రూ.1000 కోట్ల రేంజ్ లో. ఒక తెలుగు సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి. ఈ ఒక్క రీజన్ చాలు పుష్ప సినిమా కోసం ఆడియన్స్ ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో చెప్పడానికి. మరి తాజాగా అప్డేట్ తో ఈ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక పుష్ప2 విషయానికి వస్తే.. ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.