నిజంగానే బస్ కండక్టర్తో వెళ్లిపోయిందా..? స్క్రిప్టెడ్ డ్రామానా..?

నిజంగానే బస్ కండక్టర్తో వెళ్లిపోయిందా..? స్క్రిప్టెడ్ డ్రామానా..?

మలయాళ కంటెంట్ క్రియేటర్ అఖిల్ NRD భార్య మేఘా బస్ కండక్టర్తో వెళ్లిపోయిందనే వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఇదంతా ఫేమస్ అవడం కోసం పక్కా ప్లాన్తో చేస్తున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. కానీ.. అఖిల్ మాత్రం తన భార్య నిజంగానే వెళ్లిపోయిందని.. తన భార్య మేఘా స్థానిక బస్సు కండక్టర్‌తో వెళ్లిపోయిందని సీసీటీవీ ఫుటేజ్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. అఖిల్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానెల్కు 4.9 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్కు కూడా సుమారు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

అఖిల్, మేఘా.. నవంబర్ 2024లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తమ డైలీ రొటీన్ను రీల్స్గా చేసి ట్రెండింగ్ కపుల్గా మారారు. భార్యాభర్తలంటే ఇలా ఉండాలనే స్థాయిలో ఈ ఇద్దరి వీడియోలు చూస్తే అనిపించేది. అఖిల్ కంటెంట్ క్రియేషన్‌లోకి రాక ముందు సంవత్సరానికి పైగా మర్చంట్ నేవీలో శిక్షణ పొంది, పనిచేశాడు. కంటెంట్ క్రియేటర్ గా సక్సెస్ అయిన తర్వాత అతనికి 2026లో.. మలయాళ కామెడీ డ్రామా ‘మహారాజా హాస్టల్‌’లో నటించే అవకాశం వచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం ప్రకారం.. మేఘ ఇంటి నుంచి అదృశ్యమైంది. ఆ తర్వాత ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక బస్ డ్రైవర్/కండక్టర్‌గా ఉన్న వ్యక్తితో ఆమె వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. ఇంట్లో డబ్బు, నగలు తీసుకుని ఆమె ఉడాయించిందని తెలిసింది.

పోలీసులు ఈ కేసులో ఆమె మరొకరితో వెళ్లిపోయిందని అధికారికంగా నిర్ధారించలేదు. అఖిల్కు ఉన్న అక్రమ సంబంధాల వల్ల మేఘ విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం కూడా ఉంది. అఖిల్ మాత్రం బహిరంగంగా ఎవరినీ నిందించకుండా మౌనం పాటిస్తున్నాడటం గమనార్హం. సోషల్ మీడియా జంటలు ఆన్‌లైన్‌లో తమ జీవితంలోని ఒక కోణాన్ని మాత్రమే చూపిస్తారని, మరో కోణం ఇలా ఉంటుందని నెటిజన్లు ఈ ఉదంతంపై తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

►ALSO READ | చర్చకు నేను రెడీ.. సభకు వస్తారో.. పారిపోతారో మీరే తేల్చుకోండి: అమిత్ షా