పీవీ సింధు కొత్త చరిత్ర… వరల్డ్ ఛాంపియన్ షిప్ టైటిల్ విజేత

పీవీ సింధు కొత్త చరిత్ర… వరల్డ్ ఛాంపియన్ షిప్ టైటిల్ విజేత

స్విట్జర్లాండ్ : బ్యాడ్మింటిన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది షట్లర్ సింధు. BWF ఫైనల్లో గెలిచి విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ గెలిచిన మొట్టమొదటి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది. జపాన్ ప్లేయర్ ఒకుహరాపై  ఫైనల్ లో విజయం సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్ లో నొజోమీ ఒకుహరాపై 21-7, 21-7 తేడాతో.. వరుసగా రెండు సెట్లలో గెలిచి.. సంచలనం సృష్టించింది. టైటిల్ విజేతగా నిలిచింది. .

సెమీస్ లో కూడా చైనా ప్లేయర్ ను చిత్తుగా ఓడించింది. చెన్ యూఫీని 21-7, 21-14 తేడాతో ఓడించింది. ఫైనల్ లో కూడా అదే దూకుడు ప్రదర్శించింది సింధు.

ఇప్పటివరకు ప్రపంచ చాంపియన్ షిప్ లో గోల్డ్ గెలుచుకోలేదు సింధు. ఇవాళ్టితో ఆ మైలురాయి దాటింది.. ఇప్పటివరకు ఏ భారత ప్లేయర్ కూడా ప్రపంచ చాంపియన్ షిప్ లో గోల్డ్ గెలుచుకోలేదు. 2017, 2018లో రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో సింధు ఓడిపోయి సిల్వర్ తో సరిపెట్టుకుంది..

ప్రపంచ బ్యాడ్మింటిన్ లో ఇప్పటికే 4 పతకాలు సాధించింది సింధు.

మరిన్ని వార్తలు