డిగ్రీ పట్టా అందుకున్న సారా.. సచిన్ ఎమోషనల్ పోస్ట్

డిగ్రీ పట్టా అందుకున్న సారా..  సచిన్ ఎమోషనల్ పోస్ట్

భారత లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా.. క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో డిస్టింక్షన్ తో మాస్టర్స్ ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా సచిన్ తన కూతురిని అభినందిస్తూ.. సారా డిగ్రి పట్టా అందుకుంటున్న వీడియోను ఎక్స్ ద్వారా పంచుకున్నారు.  తన కలలు సాకారం కావాలని ఆకాంక్షించారు.  భవిష్యత్తులో తన కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని సచిన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

 పట్టా తీసుకున్న అనంతరం తన భార్య అంజలి, సారా దిగిన ఫోటోను ఎక్స్ లో సచిన్ పోస్ట్  చేస్తూ.. "ఇది ఒక మధురమైన రోజు. మా కుమార్తె క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన రోజు. తల్లిదండ్రులుగా, నీవు ఇక్కడికి రావడానికి సంవత్సరాల తరబడి చేసిన కృషిని చూసి మేము చాలా గర్వంగా ఫీలవుతున్నాము. ఇది అంత సులభం కాదు. భవిష్యత్తులో నీ కలలన్నింటినీ సాకారం చేస్తావని మాకు తెలుసు" అని అన్నారు.

క్రికెట్ విషయానికి వస్తే, 51 ఏళ్ల సచిన్ IPL 2024లో ముంబై ఇండియన్స్ కు మెంటర్ గా ఉన్నారు. అయితే, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు.. 17వ సీజన్ లో మాత్రం ఘోరంగా విఫలమైంది. 14 మ్యాచ్ లో కేవలం నాలుగు మ్యాచ్ ల్లోనే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. టోర్నమెంట్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా వచ్చిన హార్దిక్ పాండ్యా సారథ్యంలో జట్టు తేలిపోయింది. 143.05 స్ట్రైక్ రేట్‌తో పాటు 216 పరుగులు మాత్రమే చేసి పాండ్యా విఫలమయ్యాడు. ఆటగాళ్ల మధ్య నెలకొన్న విభేదాలు..  జట్టుపై ప్రభావం చూపింది.