T20 World Cup 2024: భారత క్రికెట్ జట్టు అమెరికా పయనం.. ఆ ఐదుగురు స్వదేశంలోనే

T20 World Cup 2024: భారత క్రికెట్ జట్టు అమెరికా పయనం.. ఆ ఐదుగురు స్వదేశంలోనే

ఐపీఎల్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. మరో రెండు మ్యాచ్ లతో టోర్నీ ముగుస్తుంది. ఇందులో భాగంగా నేడు (మే 24)  క్వాలిఫయర్ 2 లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ ఢీ కొనబోతుంది. ఆదివారం (మే 26) ఫైనల్ జరగనుంది. ఐపీఎల్ ఫైనల్ కు ముందు శనివారం (మే 25) భారత టీ20 క్రికెట్ జట్టు అమెరికా బయలుదేరనుంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్త పత్రిక నివేదించింది. టీ20 ప్రపంచ కప్ కు ఎంపికై ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడుతున్న ఆటగాళ్లు మినహాయిస్తే మిగిలిన వారు అమెరికా ఫ్లయిట్ ఎక్కుతారు.

జూన్ 2 నుంచి యూఎస్ఏ - విండీస్‌ వేదికగా టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే అర్హత సాధించిన అన్ని దేశాలు తమ టీమ్‌లను ప్రకటించాయి. భారత్‌ కూడా రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మందితో కూడిన టీమ్‌ను వెల్లడించింది. భారత్ తమ లీగ్ మ్యాచ్ లన్ని అమెరికాలోనే ఆడబోతుంది. అమెరికాలోని వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత క్రికెట్ జట్టు బయలుదేరుతుంది. జూన్ 1న బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఇక ప్రధాన మ్యాచ్ ల విషయానికి వస్తే జూన్ 5 న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ తో టీ 20 వరల్డ్ కప్ ప్రారంభిస్తుంది. 

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ , శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. సిరాజ్ ప్రధాన స్క్వాడ్ లో ఉన్నఆటగాళ్లతో పాటు  రిజర్వ్ ప్లేయర్ శుభమాన్ గిల్, ఖలీల్ అహ్మద్ భారత జట్టుతో ఫస్ట్ బ్యాచ్ ఆటగాళ్ల లిస్ట్ లో అమెరికా చేరతారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో యశస్వి జైశ్వాల్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చాహల్ తో పాటు ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు రింకూ సింగ్, అవేశ్ ఖాన్ ఐపీఎల్ ఫైనల్ తర్వాత అమెరికా వెళ్తారు. వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కేకేఆర్, రాజస్థాన్ జట్లు ప్లే ఆఫ్స్ ఆడనున్నాయి.