T20 World Cup 2024: జడేజాకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ తుది జట్టును ప్రకటించిన యువరాజ్ సింగ్

T20 World Cup 2024: జడేజాకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ తుది జట్టును ప్రకటించిన యువరాజ్ సింగ్

ఐపీఎల్ మరో రెండు రోజుల్లో ముగుస్తుండడంతో ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల దృష్టి టీ20 వరల్డ్ కప్ పై పడింది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నీ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. జూన్ 2 నుంచి జూన్ 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. శనివారం (మే 25) భారత క్రికెట్ జట్టు మొదటి బ్యాచ్ ఆటగాళ్లు అమెరికా బయలుదేరనున్నారు. 15 మందితో కూడిన భారత జట్టులోని తుది జట్టుపై అందరికీ ఆసక్తి నెలకొంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ టీ20 వరల్డ్ కప్ కు తన తుది జట్టును ప్రకటించాడు.

 యువరాజ్ సింగ్ సెలక్ట్ చేసిన ఆటగాళ్లలో ఆల్ రౌండర్ జడేజాకు అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రధాన స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు కాదని యుజ్వేంద్ర చాహల్ ను ఎంచుకున్నాడు. ఈ జట్టులో ముగ్గురు ప్రధాన పేసర్లకు అవకాశమివ్వడంతో పాటు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, దూబే ఇద్దరికి తన ప్లేయింగ్ 11 లో ఛాన్స్ ఇచ్చాడు. 

ఓపెనర్లుగా రోహిత్ తో పాటు జైస్వాల్ ను ఎంపిక చేశాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో వరుసగా విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలు యువీ జట్టులో ఉన్నారు. శివమ్ దూబే లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వస్తాడు. మార్చి 1 న బంగ్లాదేశ్ తో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడుతుంది.  ప్రధాన మ్యాచ్ ల విషయానికి వస్తే జూన్ 5 న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ తో టీ 20 వరల్డ్ కప్ ప్రారంభిస్తుంది. 9 న పాకిస్థాన్, 12 న అమెరికా,15 న కెనడా జట్లతో లీగ్ మ్యాచ్ లు ముగుస్తాయి