హైదరాబాద్లో హోటళ్లు, రెస్టారెంట్లపై కొనసాగుతున్న దాడులు

హైదరాబాద్లో  హోటళ్లు, రెస్టారెంట్లపై కొనసాగుతున్న దాడులు

 గ్రేటర్ హైదరాబాద్ లో హోటళ్లు ,రెస్టారెంట్లలో  తెలంగాణ స్టేట్ ఫుడ్ సేఫ్టీ  టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు కొనసాగుతున్నాయి.  ఇవాళ(  మే  25న) ఫుడ్ సేఫ్టీ అధికారులు మసాబ్ ట్యాంక్, ప్యారడైజ్ బిర్యానీ సెంటర్లపై దాడులు చేశారు. 

మసాబ్ ట్యాంక్ దగ్గర  అస్లీ  హైదరాబాదీ ఖానాలో  సింథటిక్ ఫుడ్ కలర్స్ గుర్తించారు. స్టేట్ లైసెన్స్ లేకుండా..రిజిస్ట్రేషన్ తోనే  రెస్టారెంట్ నడుపుతున్నట్లు గుర్తించారు. నిల్వ ఉంచిన ఆహారాన్ని గుర్తించారు. కీటకాలు  ప్రవేశించకుండా వంటగది కిటికీలకు సరైన మెష్ లేదు... పెస్ట్ కంట్రోల్ రికార్డులు అందుబాటులో లేవు. ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ (FBO) దగ్గర మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు లేవని ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అయ్యారు. 

హైదరాబాద్ లో బాగా ఫేమస్ అయిన   ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్‌లో ధార బ్రాండ్ ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లు దొరికాయని, అక్కడికక్కడే పరీక్షించగా, టిడిఎస్ లెవల్స్ 73 పిపిఎమ్‌లుగా ఉన్నాయని డిపార్ట్‌మెంట్ తెలిపింది. వీటిని ల్యాబ్ కు పంపించామని తెలిపింది. 

గత రెండు రోజుల తనిఖీల్లో మాదాపూర్ లోని రామేశ్వరం కేఫ్, కొండాపూర్ లోని బిగ్ బాస్కెట్ వేర్ హౌజ్ బాహుబలి కిచెన్, బంజారాహిల్స్ లోని లెబనల్ ఫైన్ బేకింగ్, బాస్కిన్ రాబిన్స్, ఉపల్ప్ లోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్లలో తనిఖీలు చేసి ఎక్స్ పైరీ అయిన చాక్లెట్లు, పాలు,పెరుగు, కుళ్లిన ఆహార పధార్థాలు,కూరగాయలను గుర్తించారు.  కంపుకొడ్తున్న కిచెన్ లు చూసి నిర్వాకులపై ఆగ్రహం వ్కత్ంచేశారు.  ఇప్పటి వరకు వందకు పైగా హోటల్లో రెస్టారెంట్లు ఫుడ్ సరఫరా సంస్థలను తనిఖీ చేశారు.పలు హోటళ్లు, రెస్టారెంట్లపై కేసులు నమోదు చేశారు.