నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన కేంద్ర పరిశోధన బృందం

నాగర్ కర్నూల్  జిల్లాలో పర్యటించిన కేంద్ర పరిశోధన బృందం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వివిధ శాఖల అసిస్టెంట్  సెక్షన్  అధికారులు జిల్లాలోని 5 గ్రామాల్లో పర్యటించి ప్రజల జీవన ప్రమాణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును అధ్యయనం చేసినట్లు కలెక్టర్  ఉదయ్ కుమార్  తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో అడిషనల్​ కలెక్టర్  కుమార్ దీపక్, కేంద్ర బృందం సభ్యులతో సమావేశమయ్యారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని చందుపట్ల, గన్యాగుల, అల్లాపూర్, బిజినేపల్లి, తెల్కపల్లి గ్రామాల్లో పర్యటించి గ్రామీణ ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిశీలించారని చెప్పారు. జిల్లాలో అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కలెక్టర్​ వివరించారు. అంతకుముందు కేంద్ర బృందం తాము పరిశీలించిన అంశాలను కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లి, అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.