Kayadu Lohar: విశ్వక్ సేన్ 'ఫంకీ' గర్ల్.. గ్లామర్‌తో నెట్టింట మంటలు రేపుతున్న కయాదు!

Kayadu Lohar: విశ్వక్ సేన్ 'ఫంకీ' గర్ల్.. గ్లామర్‌తో నెట్టింట మంటలు రేపుతున్న కయాదు!

గ్లామర్ ప్రపంచంలో మోడలింగ్ నుంచి వచ్చి అతి తక్కువ కాలంలో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కయాదు లోహర్. తన కళ్ళతోనే కవితలు చెప్పే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సరసన ‘ఫంకీ’ (Funky) చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ చిత్రం ఈ నెల 13న గ్రాండ్‌గా విడుదల కానుంది . ఈ నేపథ్యంలో, ప్రమోషన్స్ హీట్ పెంచేస్తోంది ఈ అమ్మడు.

మోడలింగ్ నుండి మూవీ స్క్రీన్ వరకు..

కయాదు లోహర్ ప్రయాణం మోడలింగ్ రంగంతో ప్రారంభమైంది. ఆమెలోని నటనను గుర్తించిన మేకర్స్.. 2021లో కన్నడ చిత్రం ‘మొగిల్ పేట’ ద్వారా ఆమెను వెండితెరకు పరిచయం చేశారు. ఆ సినిమాలో తన సహజ సిద్ధమైన నటనతో కన్నడ ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత మలయాళంలో ‘పాత్తోన్పథాం నూట్టాండు’ వంటి పీరియడ్ డ్రామాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, తమిళంలో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన ‘డ్రాగన్’ సినిమా ఆమె కెరియర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ఆమెకు ఒక్కసారిగా పాపులారిటీ పెరిగింది.

విశ్వక్ సేన్‌తో ‘ఫంకీ’ రచ్చ!

ప్రస్తుతం కయాదు తెలుగులో ‘ఫంకీ’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. విశ్వక్ సేన్ ఎనర్జీకి తగ్గట్టుగా ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా సందడిగా, గ్లామరస్‌గా ఉండబోతోందని సమాచారం. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌లో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నెల 13న సినిమా విడుదలవుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లలో వేగం పెంచింది.

చీరకట్టులో మెరిసిపోతున్న సుందరి

సినిమా ప్రమోషన్లలో భాగంగా కయాదు లోహర్ షేర్ చేసిన తాజా ఫొటోషూట్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా బ్లూ కలర్ శారీ కాంబినేషన్‌లో ఆమె అందం రెట్టింపైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చీరకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే, తన గ్లామర్ సొగసులతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు లవ్, ఫైర్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్‌ను నింపేస్తున్నారు. "టాలీవుడ్‌కు మరో స్టార్ హీరోయిన్ దొరికేసింది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CINE PORT (@cine_port_)

‘ఫంకీ’ సినిమా హిట్ అయితే కయాదుకు తెలుగులో మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం అంటున్నారు అభిమానులు.. ఇప్పటికే కొంతమంది టాలీవుడ్ దర్శకులు ఆమెను సంప్రదిస్తున్నట్లు టాక్. తన నటనతో పాటు అద్భుతమైన గ్లామర్ ఉన్న కయాదు, రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి తన రూపాన్ని, ప్రతిభను నమ్ముకుని టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ‘ఫంకీ’ బ్యూటీ, బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.