- ప్రాజెక్టులు, మెట్రో రైల్‌టేకోవర్ ఫండ్స్ కోసం హెచ్ఎండీఏ ప్లాన్
- రూ. 2,500 కోట్లు టార్గెట్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ లో భూముల వేలం ద్వారా భారీ ఎత్తున నిధులను సమకూర్చుకునేందుకు హెచ్ఎండీఏ ప్లాన్స్ రూపొందిస్తోంది. హెచ్ఎండీఏ ప్రాజెక్టులకు భారీగా నిధులు అవసరముండడం, మెట్రో రైల్టేకోవర్కోసం ఎల్అండ్టీకి రూ.2 వేల కోట్లు కట్టాల్సి ఉండడంతో త్వరలోనే ఉప్పల్ భగాయత్, మొకిలా, లేమూరు ప్రాంతాల్లో భూములను వేలం వేయాలని అధికారుల నిర్ణయించారు.
ఈ నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. 3 నెలల క్రితం కోకాపేటలో భూముల వేలం ద్వారా 3,862 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్న హెచ్ఎండీఏ మరోసారి మిగిలిన భూముల వేలం వేయడం ద్వారా కనీసం రూ.2,500 కోట్లు రాబట్టాలన్న ఆలోచనతో ఉంది.
డబ్బులు ఈ ప్రాజెక్టుల కోసమే!
హెచ్ఎండీఏ ఇప్పటికే ప్రతిపాదించిన కొన్ని ప్రాజెక్టులు ముఖ్యంగా రేడియల్రోడ్స్–2 ప్రాజెక్ట్, బుద్వేల్నుంచి కోకాపేట వరకు నిర్మించనున్న ట్రంపెట్ఫ్లైఓవర్, శంకర్‌పల్లిలోని ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు 3.57 కి.మీ. పైప్‌లైన్ రోడ్అభివృద్ధి ప్రాజెక్టు, నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్కు ఎడమ వైపున రోడ్డు విస్తరణకు భారీగా నిధులు అవసరమవుతాయని అధికారులు భావిస్తున్నారు.
వీటితో పాటు బంజారాహిల్స్నుంచి శిల్పా లేఅవుట్ వరకూ 9 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్, జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు18 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్, ప్యారడైజ్‌నుంచి బోయిన్పల్లి వరకూ నిర్మిస్తున్న ఎలివేటెడ్కారిడార్కోసం నిధుల అవసరం ఉంది. ఇవే కాకుండా త్వరలో మెట్రోరైల్‌ను ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే సమయంలో వారికి చెల్లించాల్సిన రూ. 2వేల కోట్లను కూడా హెచ్ఎండీఏ ఖజానా నుంచే చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు
సమాచారం.
ఎక్కడెక్కడ ఎన్ని అంటే?
గ్రేటర్ పరిధిలో హెచ్ఎండీఏకు ఉన్న కొన్ని భూముల్లో ఇప్పటికే లేఅవుట్లు వేసి ప్లాట్లు చేశారు. ఇందులో ఉప్పల్‌భగాయత్, మోకిల, ఇన్ముల్‌నర్వా, లేమూరు, తుర్కయాంజాల్లేఅవుట్లలో ఇప్పటికే కొన్ని ప్లాట్లను వేలం వేశారు. ఉప్పల్‌భగాయత్‌లో 41, తుర్కయాంజాల్‌లో 12, మోకిలలో 719, లేమూరులో 164, హుడాహైట్స్‌లో 37 మిగలగా వాటిని కూడా వేలం వేయబోతున్నారు.
