ఎవరీ మాట వినట్లే.. ఎవరాపిన ఆగట్లే: భర్తను పొట్టుపొట్టున కొట్టిన భార్య

ఎవరీ మాట వినట్లే.. ఎవరాపిన ఆగట్లే: భర్తను పొట్టుపొట్టున కొట్టిన భార్య

సీతయ్య.. ఎవరి మాట వినడు అన్న మాదిరిగా.. సీతమ్మ ఎవరి మాట వినదు అన్నట్లుగా వ్యవహరించింది ఓ మహిళా. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సదరు మహిళా కోపం కట్టలు తెంచుకున్నట్లు కనిపిస్తోంది. పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ భర్తను పొట్టుపొట్టు కొట్టింది. రూమ్‎లో బెడ్‎పై పడేసి మీద కూర్చొని చితకబాదింది. 

కుటుంబ సభ్యులు ఆపేందుకు ప్రయత్నించినా శాంతించలేదు. భర్త చెంపలను చెల్లు చెల్లుమనిపించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‎లోని సాత్నాలో జరిగింది. భార్య దాష్టీకాన్ని ఆ వ్యక్తి రహస్యంగా ఫోన్‎లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగా వైరల్ కావడంతో నెట్టింట మరోసారి పురుషులపై హింసపై చర్చ మొదలైంది. 

అదే మహిళా స్థానంలో ఆమె భర్త ఉంటే ఇప్పటికే ఫెమినిస్ట్‎లు అరిచి గగ్గోలు పెట్టి దానిని నేషనల్ ఇష్యూ చేసేవారని.. మరీ ఇప్పుడా మహిళను ఏం అంటారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన భార్యల వేధింపులకు బలైన అతుల్ సుభాష్, మానవ్ శర్మతో సహా పురుషులపై జరిగిన హింస కేసులను గుర్తుకు తెస్తుందంటుంన్నారు పలువురు నెటిజన్లు. 

బాధిత వ్యక్తి వివరాలు తనకు ఇస్తే అతని భార్యపై కేసు నమోదు చేయడంలో సహాయం చేస్తానని ఓ యూజర్ కామెంట్ చేశాడు. సదరు మహిళకు తగిన గుణపాఠం చెప్పాలని ఓ నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేయగా.. భార్య బాధితులు ధైర్యం కోల్పోకుండా పోరాడాలని.. అంతేకానీ ప్రాణాలు తీసుకోవద్దని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే.. ఆ మహిళా తన భర్తను ఎందుకు ఆ విధంగా వీరబాదుడు బాదిందనే విషయం మాత్రం తెలియదు. మ్యాటర్ ఏదైనప్పటికీ అలా కొట్టడం కరెక్ట్ కాదంటున్నారు నెటిజన్లు.