హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో దారుణం జరిగింది. ఇనోవా కారు అతివేగంతో వచ్చి మోటార్ సైకిల్ని ఢీకొట్టడంతో బైక్పై ఉన్న వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. శంకర్ పల్లి మండల కేంద్రంలోని ఎర్రగడ్డ గ్రామ రెవెన్యూ పరిధిలోని ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామానికి చెందిన పూలపల్లి రవీందర్ గౌడ్ శంకర్ పల్లి నుంచి తంగడపల్లికి బైక్పై వస్తుండగా ఇన్నోవా కారు అతివేగంతో వచ్చి ఢీకొనడంతో అక్కడనే చనిపోయాడు.
రవీందర్ గౌడ్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ముత్తంగిలో నివాసముంటున్నట్టుగా తెలిసింది. తన కూతురు పెండ్లి కొన్ని రోజులలో ఉండడంతో తాను తంగడపల్లికి గ్రామానికి వెళ్లి పెండ్లి పనులను చూసుకోవడానికి వస్తున్నాడు. అతనిని హైదరాబాద్కు చెందిన ఇనోవా కారు ఢీకొనడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోని చనిపోయినట్టుగా డాక్టర్లు గుర్తించారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్టు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
