ఇండియా పోస్ట్ జీడీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 16.
ఖాళీలు: గ్రామీణ డాక్ సడక్ (జీడీఎస్) – బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంగ్లిష్, గణితం పాస్ మార్కులతో 10వ తరగతి/ సెకండరీ స్కూల్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 31.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 16.
సెలెక్షన్ ప్రాసెస్: పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు indiapost.gov.in/gdsonlineengagement వెబ్సైట్ను సందర్శించండి.
►ALSO READ | BSNL Jobs: ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్.. ఆన్ లైన్ అప్లికేషన్.. పూర్తి వివరాలు ఇవే..!
