BSNL Jobs: ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్.. ఆన్ లైన్ అప్లికేషన్.. పూర్తి వివరాలు ఇవే..!

BSNL Jobs:  ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్.. ఆన్ లైన్ అప్లికేషన్.. పూర్తి వివరాలు ఇవే..!

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గలఅభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మార్చి 07.

ఖాళీలు: 120. 

విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (డీఆర్) టెలికాం స్ట్రీమ్ 95,
                                               సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (డీఆర్) ఫైనాన్స్ స్ట్రీమ్ 25.


ఎలిజిబిలిటీ

టెలికాం స్ట్రీమ్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి  ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ లేదా సమాన ఇంజినీరింగ్ అర్హత కలిగి ఉండాలి.

ఫైనాన్స్ స్ట్రీమ్:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి: 21 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 05.

అప్లికేషన్ ఫీజు: అన్​రిజర్వ్డ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.1250. 

లాస్ట్ డేట్: మార్చి 07.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు https://bsnl.co.in వెబ్​సైట్​ను సందర్శించండి.

►ALSO READ | సికింద్రాబాద్ రైల్వే జోన్ లో జాబ్ల జాతర : గ్రూప్ డి పోస్టులు.. పది పాసైతే చాలు ..