విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం...

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం...

వేసవి సెలవులు ముగుస్తున్నాయి. స్కూళ్లలో కొత్త అడ్మిషన్ల హడావుడి మొదలైంది. అడ్మిషన్ల హడావుడితో యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాల పంపిణీ హడావిడి కూడా మొదలవుతుంది. స్కూల్స్ మొదలైన నెల, రెండు నెలలకు కూడా పాఠ్యపుస్తకాలు అందని పరిస్థితి గతంలో ఉండేది. కానీ, ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడ్డాక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఏటా సకాలంలోనే పాఠ్యపుస్తకాల పంపిణీ జరుగుతోంది. ఈ ఏడాది కూడా పాఠశాలలు ప్రారంభమైన మొదటిరోజే పాఠ్యపుస్తకాల పంపిణీ ఉంటుందని తెలిపింది ప్రభుత్వం.

ఇప్పటికే మండల లెవెల్ స్టాక్ పాయింట్లకు 2024 - 25సంవత్సరానికి సంబంధించి మొదటి సెమిస్టర్ కు అవసరమైన టెక్స్ట్ బుక్స్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ప్రైవేట్ స్కూళ్లకు అవసరమైన బుక్స్ మరో రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ALSO READ | అంతరిక్షంలో తెలుగు తేజం.. రెండో భారతీయుడిగా రికార్డు