Raju Yadav Movie Review: గెటప్ శ్రీను రాజు యాదవ్ సినిమా ఎలా ఉందంటే?

Raju Yadav Movie Review: గెటప్ శ్రీను రాజు యాదవ్ సినిమా ఎలా ఉందంటే?

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను(Getup Srinu) హీరోగా చేసిన మొదటి సినిమా రాజు యాదవ్(Raju Yadav). యదార్థ సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు కృష్ణమాచారి తెరకెక్కించగా.. అంఖితా కారట్,ఆనంద చక్రపాణి ప్రధాన పాత్రల్లో కనిపించారు. కొన్ని కారణాల వల్ల మనిషి మొహం ఎప్పుడు నవ్వుతూ ఉండేలా మారిపోతే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమాకు సపోర్ట్ గా నిలువడంతో ఈ సినిమా ఆడియన్స్ లోకి వెళ్ళింది. ఇక ఈ సినిమా నేడు(మే 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి రాజు యాదవ్ సినిమా ఎలా ఉంది? గెటప్ శ్రీను హీరోగా ఏమేరకు మెప్పించాడు? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
రాజు యాదవ్(గెటప్ శ్రీను) డిగ్రీ ఫెయిల్ అయ్యి ఊర్లో బలాదూర్ తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు క్రికెట్ ఆడుతుంటే బాల్ మొహానికి బలంగా తగులుతుంది. ఆ కారణంగా రాజు ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్టుగానే మారిపోతుంది. దాని వల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటాడు రాజు. ఊళ్ళో అందరు హేళన చేస్తుంటారు. అదే సమయంలో తన ఫ్రెండ్ పెళ్లికి వచ్చిన స్వీటీ (అంకితా కరాట్)ని చూసి తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడతాడు. 

ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాజు మొహాన్ని అందరూ హేళన చేస్తే.. హీరోయిన్ మాత్రం అతనితో స్నేహం చేస్తుంది. తరువాత.. స్వీటీకి జాబ్ రావడంతో హైదరాబాద్‌కి వెళ్ళిపోతుంది. రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ సిటీకి వెళ్లి క్యాబ్ డ్రైవర్‌గా జాయిన్ అవుతాడు. అక్కడినుండి రాజు కథ ఎన్ని మలుపులు తిరిగింది? స్వీటీని రాజు కలిసాడా? నిజంగా స్వీట్ రాజుని ప్రేమించిందా? చివరికి ఏం జరిగింది అనేది రాజు యాదవ్ మిగిలిన కథ.

విశ్లేషణ:
రాజు యాదవ్ కథ చాలా రొటీన్ కథ. అమ్మాయిల చేతిలో మోసపోవడం అనే కాన్సెప్ట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇటీవల వచ్చిన బేబీ సినిమా కూడా ఇదే కాన్సెప్ట్ తో వచ్చిందే. కేవలం గెటప్ శ్రీనులోని నటుడుని వాడుకోవడం కోసం తీసిన సినిమా తప్పా చెప్పుకోవడానికి ఏమీ లేదు సినిమాలో. అసలు రాజు స్వీటీని ఎందుకు అంతలా లవ్ చేస్తాడు? అన్నీ వదిలేసి స్వీటీ కోసం హైదరాబాద్ రావడం, ఆమె కోసం పిచ్చోడయిపోవడానికి బలమైన కారణాలు ఏమీ కనిపించవు. అందుకే రాజు యాదవ్ రొటీన్ సినిమాగా మారిపోయింది. 

నటీనటులు, సాంకేతిక నిపుణులు:
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గెటప్ శ్రీను నటన గురించి. ఎప్పుడు నవ్వుతూ ఉండి యాక్ట్ చేయడం అనేది మాములు విషయం కాదు. ఆ పాత్రని చాలా ఈజీగా చేసి షెబాష్ అనిపించాడు శ్రీను. కొన్ని సీన్స్ లో తన నటనతో కన్నీళ్లు పెట్టించాడు. సినిమా మొత్తాన్ని తానే ముందుండి నడిపించాడు. ఇక హీరోయిన్ అంకితా కరాట్ స్వీటీ పాత్రకి న్యాయం చేసింది. బోల్డ్ సీన్‌లలో జీవించేసింది. లిప్ లాక్‌, బెడ్ రూం సీన్లలో ఏమాత్రం మొహమాటం లేకుండా చేసి టూ నాటీ అనిపించింది. ఇక మిగిలినవారు పాత్రకు తగ్గట్టుగా బాగానే చేశారు. ఇక రాజు యాదవ్ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన పాటలు చాలా బాగున్నాయి.సాయిరామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ సినిమాకి సెట్ బాగా అయ్యాయి.

ఇక మొత్తంగా రాజు యాదవ్ సినిమాలో గెటప్ శ్రీను నటన హైలెట్.. మరి సినిమా?