మిథాలీ రాజ్‌తో పెళ్లి.. మౌనం వీడిన శిఖర్ ధావన్

మిథాలీ రాజ్‌తో పెళ్లి.. మౌనం వీడిన శిఖర్ ధావన్

భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌ను.. టీమిండియా వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ పెళ్లాడబోతున్నట్లు కొన్ని నెలల క్రితం వార్తలు చక్కర్లు కొట్టిన విషయం అందరికి విదితమే. తాజాగా, ఈ పుకార్లపై ధావన్ నోరు విప్పారు. స్నేహితుల ద్వారా ఈ రూమర్స్ తన చెవిన పడ్డాయని తెలిపారు. జియో సినిమా షో ' ధావన్ కరేంగే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధావన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"నేను మిథాలీ రాజ్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు వచ్చాయి.. నేనూ విన్నాను.." అని ధావన్ వెల్లడించారు.

బంధం పటాపంచలు

కాగా, ధావన్.. తనకంటే వయస్సులో పదేళ్లు పెద్దది, అప్పటికే పెళ్ళై ఇద్ధరు పిల్లలున్న ఆయేషా ముఖర్జీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  2012లో వీరి వివాహం జరగ్గా.. సరిగ్గా 11 ఏళ్ల తరువాత వీరి బంధం అర్థాంతరంగా ముగిసింది. 2023లో పరస్పర అంగీకారంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు జోరావర్ ఉన్నాడు. ప్రస్తుతం గబ్బర్.. ఒంటరిగానే ఉంటున్నారు. 

పెళ్ళికి దూరంగా మిథాలీ 

మరోవైపు, మిథాలీ రాజ్‌ పెళ్లి చేసుకోకుండా ఒంటిరిగానే జీవిస్తోంది. నిజానికి మిథాలీకి 22 ఏళ్లు వచ్చినప్పటి నుంచే పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు కుటుంబసభ్యులు. అయితే, క్రికెట్‌తో బిజీగా ఉండటం వల్ల ఎన్ని సంబంధాలు వచ్చినా వాటిని రిజెక్ట్ చేసింది. చివరకు 27-30 ఏళ్లు వచ్చాక పెళ్లి గురించి ఆలోచన మానేసిందట. అయితే,  పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో వచ్చిన సంబంధాల్లో చాలా వరకూ క్రికెట్‌తో తన బంధాన్ని తెంచుకుంటేనే ముందుకు సాగుతామని తెలపడంతో వాటిని వదిలేసిందట. ఇలా మిథాలీ క్రికెట్ కోసం తన పర్సనల్ లైఫ్‌ని త్యాగం చేసేసిందనమాట. అలా అని తానేం బాధపడటం లేదు. సింగిల్‌గా చాలా హ్యాపీగా ఉన్నానంటోంది.