పరకడుపునే నీరు తాగితే లాభాలేంటి.. ఎన్ని గ్లాసులు తాగాలి..

పరకడుపునే నీరు తాగితే లాభాలేంటి.. ఎన్ని గ్లాసులు తాగాలి..

ఉదయం లేవగానే పరకడుపున నీరు తాగటం ఆరోగ్యానికి మంచిదన్నది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఉదయం లేవగానే పరకడుపున నీరు తాగటం వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే ఈ అలవాటును తప్పక అలవరచుకుంటారు.వాటర్ మన బాడీకి ఇంధనంలా పని చేస్తుంది. ఉదయాన్నే వాటర్ తాగటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరంలోని మలినాలను నిర్ములిస్తుంది.

ఉదయాన్నే పరకడుపున నీరు తాగటం వాళ్ళ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా ఈ అలవాటు ఉన్నవారిలో కిడ్నీ వ్యాధులు, కిడ్నీలో రాళ్లు చేరే సమస్య అరుదుగా వస్తుంది. పరకదుడుపున నీళ్లు తాగటం అలవాటు చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయాన్నే ఎన్ని గ్లాసుల నీరు తాగాలి వంటి డీటెయిల్స్ ఇక్కడ తెలుసుకుందాం:

  • ఉదయాన్నే వాటర్ తాగటం వల్ల మన బాడీలోని న్యాచురల్ సిస్టం యాక్టివేట్ అయ్యి, మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది.
  • జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
  • ఉదయాన్నే ఎక్కువ నీరు తాగటం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటాము
  • ఉదయాన్నే వాటర్ తాగటం వల్ల సమ్మర్లో బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.
  • పరకడుపున నీరు తాగటం వల్ల శరీరానికి, మెదడుకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. దీనివల్ల మెదడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
  • ఉదయాన్నే నీరు తాగటం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది. దీని వల్ల కిడ్నీలు, లివర్ మీద భారం తగ్గుతుంది. 
  • పరకడుపున నీరు తాగటం వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.

ఉదయం లేవగానే బ్రష్ చేశాక 2నుండి 3గ్లాసుల నీరు తాగితే మంచిది. మీకు బెడ్ కాఫీ తాగే అలవాటు ఉన్నా కూడా మొదట నీరు తాగండి. ఈ అలవాటు లేని వారు మొదట 1గ్లాసు నీరు తాగటంతో ప్రారంభించి మెల్లగా రెండు, మూడు గ్లాసుల వరకు వెళ్తే మంచిది. గోరువెచ్చని నీరు తాగటం అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.అయితే, నీరు తగిన అరగంట వరకు ఏమీ తినకుండా ఉండటం మంచిది.