సిడ్నీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్-500 టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో మూడో సీడ్ సింధు, ఇషారాణి బారువా (భారతదేశం)ను 22-20, 21-12 తేడాతో ఓడించింది. 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లోని మొదటి గేమ్‌లోనే సింధుకు గట్టి పోటీ ఎదురైంది.
మరో మ్యాచ్‌లో తన్వి శర్మ, మాలవిక బన్సోట్‌ను 21-13, 21-15 తేడాతో ఓడించగా, తాన్యా హేమంత్, పోర్న్ పావి చోచువాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో 12-21, 15-21 తేడాతో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్‌లో ఎం.ఆర్. అర్జున్-హరిహరన్ జోడీ, మైఖేల్ ఓవెన్-డైలాన్ సోజేసా (న్యూజిలాండ్) జోడీపై 21-17, 21-7 తేడాతో గెలుపొందగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ రావత్-మనీషా జోడీ, అకిరా కోగా-నాట్సు సైటో (జపాన్) జోడీ చేతిలో 19-21, 18-21 తేడాతో ఓటమి పాలైంది.
