షటిల్స్‌ వార్.. నేటి నుంచి థాయ్‌లాండ్‌ ఓపెన్‌

షటిల్స్‌ వార్.. నేటి నుంచి థాయ్‌లాండ్‌ ఓపెన్‌

సింధు, సైనా  రీఎంట్రీ

బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌‌‌: కరోనా కారణంగా ఇంటర్నేషనల్‌‌‌‌ క్యాలెండర్‌‌‌‌ దెబ్బతినడంతో దాదాపు పది నెలల లాంగ్‌‌‌‌ గ్యాప్‌‌‌‌ తర్వాత ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌‌‌‌ తిరిగి పోటీ పడుతున్నారు. మంగళవారం మొదలయ్యే యోనెక్స్‌‌‌‌ థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌ 1000 టోర్నమెంట్‌‌‌‌లో వీరిద్దరితో పాటు ఇండియా షట్లర్లు బరిలోకి దిగుతున్నారు.  ఒలింపిక్స్​ముందు ఏషియన్​ లెగ్​లో భాగంగా జరుగుతున్న  ఈ టోర్నీపై అందరి దృష్టి ఉంది. రెండు నెలలుగా లండన్‌‌‌‌లో ట్రెయినింగ్‌‌‌‌ తీసుకుంటున్న సింధు ఈ టోర్నీతో మళ్లీ రిథమ్‌‌‌‌ అందుకోవాలని చూస్తోంది. ఇంకోవైపు కరోనాను జయించిన సైనా.. తన ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ను టెస్టు చేసుకోవాలని అనుకుంటోంది. బలమైన జపాన్​, చైనా షట్లర్లు లేకపోవడం ఈ టోర్నీలో మన ప్లేయర్లకు ప్లస్​ కానుంది. ​ ఆరో సీడ్‌‌‌‌ సింధు.. డెన్మార్క్‌‌‌‌కు చెందిన మియా బ్లిచ్‌‌‌‌ఫెల్ట్‌‌‌‌తో టోర్నీని ఆరంభించనుండగా.. సైనా నెహ్వాల్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో మలేసియన్‌‌‌‌ కిసోనా సెల్వాడురేను ఎదుర్కోనుంది. ఇక, సెకండ్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో సైనాకు వరల్డ్‌‌‌‌ నం. 12 బుసానన్‌‌‌‌తో సవాల్‌‌‌‌ ఎదురవనుంది. సెకండ్‌‌‌‌ రౌండ్‌‌‌‌ దాటితే సైనా, సింధు ఇద్దరూ హెడ్‌‌‌‌ టు హెడ్‌‌‌‌ పోటీ పడనున్నారు. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో మాజీ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ కిడాంబి శ్రీకాంత్‌‌‌‌, బి. సాయి ప్రణీత్‌‌‌‌, హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రణయ్‌‌‌‌ బరిలో ఉన్నారు. అక్టోబర్‌‌‌‌లో జరిగిన డెన్మార్క్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో క్వార్టర్స్‌‌‌‌ చేరిన శ్రీకాంత్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో టీమ్‌‌‌‌మేట్‌‌‌‌ సౌరభ్‌‌‌‌ వర్మతో పోటీ పడతాడు. 13వ ర్యాంకర్‌‌‌‌ ప్రణీత్‌‌‌‌ లోకల్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ కంటాఫొన్‌‌‌‌ను ఎదుర్కోనున్నాడు. ప్రణయ్‌‌‌‌కు ఎనిమిదో సీడ్‌‌‌‌ లీ జి జా (మలేసియా)ను సవాల్‌‌‌‌ ఎదురవనుంది. పారుపల్లి కశ్యప్‌‌‌‌, సమీర్‌‌‌‌ వర్మతో పాటు డబుల్స్​ సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌, సుమీత్​–మను,  అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి జంటలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.