రిటైర్డ్ అవుతున్న జడ్జ్ వివాదాస్పద కామెంట్స్

రిటైర్డ్ అవుతున్న జడ్జ్ వివాదాస్పద కామెంట్స్

కోల్‌కత్తా హైకోర్టు న్యామూర్తి తన రిటైర్ మెంట్ ప్రొగ్రామ్ లో  సంచలన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ చిత్త రంజన్ దాస్ మే20న తన వీడ్కోలు సమావేశంలో తాను ఒ-క ఆర్ఎస్ఎస్ సభ్యుడని, న్యాయమూర్తి వృత్తి వల్ల ఆ సంస్థకు 37 ఏళ్లపాటు దూరంగా ఉండాల్సి వచ్చిందని అన్నారు. తాను నిజంగా ఆర్ఎస్ఎస్ కు రుణపడి ఉన్నానని, అప్పుడూ, ఇప్పుడూ తాను ఓ సంఘ్ సభ్యునిగానే చెప్పుకుంటానని వివాదస్పద కామెంట్స్ చేశారు. రిటైర్‌మెంట్ ఫంక్షన్ లో ఆయనకు RSSతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన తీరును పలువురు విమర్శిస్తున్నారు. తాను న్యాయమూర్తి అయిన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌కు దూరమయ్యానని, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని కేసులు, ట్రయిల్స్ పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించానని దాస్ చెప్పారు.

ఒడిశాకు చెందిన జస్టిస్ చిత్తరంజన్ దాస్ 1986లో న్యాయవాదిగా ప్రారంభించారు. 1999లో ఒడిశా న్యాయ సేవలో ప్రవేశించి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అదనపు జిల్లా,సెషన్స్ జడ్జిగా పనిచేశాడు. ఆ తర్వాత ఒరిస్సా హైకోర్టు రిజిస్ట్రార్  నియమితులయ్యారు. 2009 న ఒరిస్సా హైకోర్టు అడిషినల్ జడ్జ్ గా పదోన్నతి పొందాడు. 2022 న కలకత్తా హైకోర్టుకు బదిలీ  అయ్యాడు. 2024 మే20న ఆ పదవి నుంచి రిటైర్ అయ్యారు.