2026 వచ్చేసింది.. న్యూజిలాండ్ లో కేక పెట్టిన సంబరాలు

2026 వచ్చేసింది.. న్యూజిలాండ్ లో కేక పెట్టిన సంబరాలు

2026 సంవత్సరం వచ్చేసింది.. న్యూజిలాండ్ దేశం మొట్టమొదటగా న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్ కం చెప్పింది. 2026 సంవత్సరం.. అర్థరాత్రి 12 గంటలకు సంబరాన్ని అంటే సంబరాలతో న్యూజిలాండ్ జనం గ్రాండ్ సెలబ్రేషన్స్ చేశారు. 

ఆక్లాండ్ లోని స్కై టవర్ దగ్గర అబ్బురపరిచే బాణాసంచా వెలుగులు జనాన్ని మైమరిపించాయి. ఈ స్కై టవర్ దగ్గర వాటర్ ఫ్రంట్ పార్టీలు, లైట్ షోలు ఆకట్టుకున్నాయి. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ న్యూజిలాండ్ వాసులు కేకలు, అరుపులతో స్కై టవర్ ఏరియా మార్మోగింది. స్కై టవర్ దగ్గర కొత్త సంవత్సర వేడుకలు చూడటానికి లక్షల మంది జనం తరలివచ్చారు.

భారతదేశం టైం ప్రకారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకే అక్కడ.. కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యింది. ప్రపంచంలోనే కొత్త ఏడాది ఆక్లాండ్ సిటీలోనే మొదలవుతుంది. 2026 సంవత్సరానికి స్వాగతం చెబుతూ.. ఆక్లాండ్ వాసులు, టూరిస్టులు ఆనందోత్సవాల మధ్య పార్టీలు చేసుకుంటూ గ్రాండ్ వెల్ కం చెప్పారు. ఆక్లాండ్ సిటీలో న్యూ ఇయర్ వేడుకలతో ప్రపంచం మరో కొత్త ఏడాదిలోకి.. 2026లోని ఎంటర్ అయిపోయింది.