హైదరాబాద్, వెలుగు: బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ కమర్షియల్ వెహికల్స్ (సీవీల) కోసం ఎకో అష్యూర్ అనే కొత్త యాడ్ ఆన్ కవర్ను ప్రవేశ పెట్టింది. రిపేర్ల ఖర్చులను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. రీకండీషన్ చేసిన విడిభాగాలను వాడినప్పుడు తరుగుదలపై వంద శాతం మినహాయింపు ఇస్తారు.
ప్రమాదాల సమయంలో టోయింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. వాహనాలు త్వరగా రోడ్డుపైకి వచ్చేలా క్లెయిమ్ ప్రక్రియ సులభతరం చేస్తామని ఎండీ తపన్ సింఘేల్ తెలిపారు. ఏ వర్క్ షాపులోనైనా ఎకో అష్యూర్ ప్రయోజనాలు పొందవచ్చు. వాహన యజమానుల ఆర్థిక భారం తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ ప్లాన్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా రక్షణ లభిస్తుంది.
