మెహిదీపట్నం, వెలుగు : లేట్ నైట్ లో పాన్ షాప్ రన్ చేసిన వ్యక్తికి జైలు శిక్షతో పాటు ఫైన్ విధించారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. మహమ్మద్ మజర్ పాషా (21) రూల్స్ కు విరుద్ధంగా అర్ధరాత్రి పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా.. 5 రోజుల జైలు శిక్ష, రూ.250 ఫైన్ విధిస్తూ జడ్జి ఉమాపతిరావు తీర్పు చెప్పారు
