పాత పద్ధతిలోనే..ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలి : ఆర్.కృష్ణయ్య 

పాత పద్ధతిలోనే..ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలి : ఆర్.కృష్ణయ్య 

కాచిగూడ, వెలుగు: ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పాత పద్ధతిలోనే యథావిధిగా కొనసాగించాలని, పెండింగ్ బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం కాచిగూడలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారితో కలిసి ఆయన మాట్లాడారు.

విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఫీజు నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అడ్మిషన్ల ప్రక్రియ గందరగోళంగా మారిందని, కాలేజీ యాజమాన్యాలు పూర్తి ఫీజు చెల్లిస్తేనే చేర్చుకుంటామని తేల్చిచెబుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో బీసీ నేతలు గుజ్జ సత్యం, రాజేందర్, అనంతయ్య, రాందేవ్ మోడీ, నిఖిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు