వాడు ప్రేమకోసం చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు

వాడు ప్రేమకోసం చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు

యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ గ్లింప్స్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బోయ్‌గా నటిస్తున్నాడు. ప్రభాస్‌కు జోడిగా పూజాహెగ్డే నటిస్తోంది. వీడియో గ్లింప్స్‌లో ప్రభాస్.. పూజా కోసం వెతకడం.. ఆమెకు ప్రపోజ్ చేయడం అందరికీ నచ్చుతాయి. ‘నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా అని ప్రభాస్‌ను పూజా ప్రశ్నించగా.. ఛా.. వాడు ప్రేమ కోసం చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ చాలా రోమాంటిక్‌గా ఉంటుంది.

యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై కృష్ణంరాజు సమర్పణలో వంశీరెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్, ఉప్పలపాటి ప్రసీద నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నాడు. ఈ మూవీకి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను జూలై 30, 2021న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రవర్గం ప్రకటించింది.

For More News..

దేశ చరిత్రలో సంజీవయ్యది చెరగని స్థానం

జూబ్లీహిల్స్‌‌లో ఇల్లు కోసం రూ.41 కోట్లు

క్యాచ్​కు అప్పీల్​ చేస్తే ఎల్బీకి రివ్యూ చేసిండు