- విద్యావ్యవస్థ మార్పునకు పోరాడాలని పిలుపు
న్యూఢిల్లీ: దేశ విద్యావ్యవస్థలో జరుగుతున్న పేపర్ లీకులు, ఫీజుల దోపిడీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమరశంఖం పూరించారు. విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన ఛాత్రోం కీ గూంజ్ (విద్యార్థుల గర్జన) పేరిట భారీ సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఎక్స్ వేదికగా ఒక లింక్‌ను పంచుకుంటూ.. పేపర్ లీకులు, పరీక్షల అక్రమాలు, అధిక ఫీజుల వల్ల విద్యార్థుల కలలు ఛిద్రమై ఉంటే, ఈ వేదిక ద్వారా తమ నిరసన గళాన్ని వినిపించాలి" అని ఆయన పిలుపునిచ్చారు. మధ్యతరగతి, పేద విద్యార్థులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన విద్యను అందించడం, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం, చదువు పూర్తి చేసిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
