RR vs RCB: ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మరో ఉత్కంఠ పోరు జరగబోతోంది. గువాహటి లోని బార్సపారా మైదానం ఈ హైటెన్షన్ మ్యాచ్‌కు వేదికగా నిలుస్తోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇరు జట్లు అద్భుత ప్రదర్శనతో ఒక్క మ్యాచులో కూడా ఓడిపోలేదు. కాగా రాజస్థాన్ చెన్నై, గుజరాత్, ముంబై జట్లపై వరుస విజయాలు సాధించి మంచి ఊపులో కనిపిస్తుండగా.. మరోవైపు, గత సీజన్ ట్రోఫీ సాధించడంతో పాటు హైదరాబాద్, చెన్నైపై గెలిచి బలమైన పోటీదారుగా బరిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత బలపరుచుకోనుంది. రాజస్థాన్ గెలిస్తే అగ్రస్థానాన్ని కాపాడుకుంటుంది. బెంగళూరు గెలిస్తే మెరుగైన సగటుతో నెంబర్ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది.
వాతావరణ పరిస్థితులు
గువాహటిలో ఈరోజు వాతావరణం కొంత మబ్బుగా ఉండే అవకాశం ఉంది. మధ్య మధ్యలో వర్షం అంతరాయం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ వర్షం ఎక్కువ సేపు కొనసాగే అవకాశాలు మాత్రం తక్కువగా ఉండటంతో పూర్తి ఇరవై ఓవర్ల పాటు మ్యాచ్ జరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
హెడ్ టు హెట్ రికార్డులు:
ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్ లో మొత్తం 34 సార్లు తలపడ్డాయి. అందులో బెంగళూరు జట్టు స్వల్ప ఆధిక్యంతో 17 మ్యాచ్‌లలో గెలిచింది. రాజస్థాన్ 14 మ్యాచ్‌లలో విజయం సాధించగా, 3 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. గత సీజన్లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు టీమ్ విజయం సాధించింది.
►ALSO READ | IPL 2026: RCB vs RR మధ్య హై-వోల్టేజ్ పోరు.. కోహ్లీ, సూర్యవంశీ దూకుడుపై నెట్టింట చర్చ
తుది జట్ల అంచనా:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డి. ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్.
ఇంపాక్ట్ ప్లేయర్: తుషార్ దేశ్‌పాండే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, ఎ. సింగ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ.
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ
