నా భర్త అమాయకుడు.. అవి పోర్న్‌ కాదు ఎరోటిక్

V6 Velugu Posted on Jul 24, 2021

ముంబై: పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన తన భర్త రాజ్‌ కుంద్రా అమాయకుడని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి చెప్పింది. అతడు తీసింది పోర్న్ సినిమాలు కాదని, ఎరోటిక్ సినిమాలని పేర్కొంది. ముంబై క్రైం బ్రాంచ్  పోలీసులు శుక్రవారం శిల్పా శెట్టిని ఆమె ఇంట్లో ప్రశ్నించారు. ఆరు గంటల పాటు జరిగిన ఇంటరాగేషన్‌లో ఆమె ఈ కామెంట్స్ చేసిందని పోలీసుల వర్గాల ద్వారా తెలిసింది. బాలీవుడ్‌లో నటించాలని ముంబై వచ్చే యువతులను  ట్రాప్ చేసి, సినిమా చాన్స్‌లు ఇప్పిస్తామని చెప్పి.. పోర్న్ సినిమాల్లో నటింపజేసి వాటిని యూకేలోని పెయిడ్ యాప్స్‌లో రిలీజ్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ వారంలో రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో శిల్పా శెట్టి ప్రమేయం గురించి ప్రశ్నించేందుకు నిన్న (శుక్రవారం) సాయంత్రం ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేశారు. భర్త రాజ్ కుంద్రా హాట్‌షాట్స్‌ యాప్‌ వ్యాపారానికి సంబంధించి తన ప్రమేయం ఏమీ లేదని ఈ సందర్భంగా శిల్పా శెట్టి పోలీసులకు చెప్పింది. ఆ యాప్‌ ద్వారా తనకు ఎటువంటి సంపాదనా లేదని తెలిపింది. పోలీసులు రికార్డ్‌ చేసిన స్టేట్‌మెంట్‌లో ఆమె కేవలం తన రోల్ లేదని చెప్పడంతో పాటు తన భర్త రాజ్‌ కుంద్రా ఎటువంటి పోర్న్‌ సినిమాలు ప్రొడ్యూస్ చేయలేదని, అతడు తీసింది ఎరోటిక్ సినిమాలేనని, చెబుతూ ఆ రెండింటికీ మధ్య తేడాను వివరించే ప్రయత్నం చేసింది.  అలా చెబుతూనే మరోవైపు హాట్‌షాట్స్‌లో పెట్టే కంటెంట్ ఏంటో ఎగ్జాక్ట్‌గా తనకు తెలియదన్నది. అలాగే ఇతర ఓటీటీల్లో వచ్చే వీడియోలు, వెబ్‌ సిరీస్‌లలో కంటెంట్ చాలా వరకు పోర్నోగ్రఫిక్ కంటెంట్ ఉంటోదని పేర్కొంది.

Tagged Porn videos, Raj Kundra, shilpa shetty, Erotic Videos, Porn Racket

Latest Videos

Subscribe Now

More News