రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్ రిలీజ్

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్ రిలీజ్

రాజ్ తరుణ్ , అమృత చౌదరి జంటగా  నటిస్తున్న కొత్త సినిమా ‘టార్టాయిస్’.   అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ  ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో  విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు.  శుక్రవారం ఈ సినిమా నుంచి ‘నీ పరిచయం’ అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, చిన్మయి పాడిన విధానం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్‌‌ ఈవెంట్‌‌లో రాజ్ తరుణ్ మాట్లాడుతూ ‘ఇదొక యూనిక్ థ్రిల్లర్. ప్రేక్షకుల్ని  కంప్లీట్‌‌గా ఎంగేజ్ చేస్తుంది.

ఇందులో  మంచి మెలోడీ సందర్భం వచ్చినప్పుడు అనూప్ గారు బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు. ఈ పాటను అందంగా పాడిన చిన్మయి గారికి, సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్ గారికి థ్యాంక్స్’ అని చెప్పాడు. ఏపీలోని రావులపాలెంలో జరిగిన ఈ సాంగ్‌‌ షూట్‌‌ను తాను ఎంతో ఎంజాయ్ చేశానని అమృత చౌదరి చెప్పింది. ఇది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మూవీ అని నటులు అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ అన్నారు. బొమ్మరిల్లు, మజిలీ లాంటి చిత్రాలను థ్రిల్లర్ జానర్‌‌‌‌లో తీస్తే ఎలా ఉంటుందో  ‘టార్టాయిస్’  అలా ఉంటుందని డైరెక్టర్ రిత్విక్ కుమార్ చెప్పాడు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని నిర్మాతలు అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.