అశోక్‌ గెహ్లాట్‌కు చెక్‌పేట్టేందుకు.. రాజస్థాన్‌లో పంద్రాగస్టు వేడుకలు రద్దు

అశోక్‌ గెహ్లాట్‌కు చెక్‌పేట్టేందుకు.. రాజస్థాన్‌లో పంద్రాగస్టు వేడుకలు రద్దు
  • నిర్ణయించిన గవర్నర్‌‌ కల్‌రాజ్‌ మిశ్రా

జైపూర్‌‌: రాజస్థాన్‌లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌ను క్యాన్సిల్‌ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం ఉదయం ప్రకటన రిలీజ్‌ చేశారు. రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, వైరస్‌ కేసుల గురించి ఆందోళన చెందుతున్నానని ఆయన అన్నారు. మార్చి 13న అసెంబ్లీ రద్దు చేసినప్పుడు రెండు కేసులు ఉన్నాయని, ఇప్పుడు పదివేల కేసులు నమోదయ్యాయని అన్నారు. “ జులై 1 నాటికి 3381 కేసులు ఉన్నాయి. ఇప్పుడు అవి పదివేలకుచేరాయి. దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి” అని మిశ్రా అన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మూడోసారి ప్రపోజల్ పెట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అశోక్‌గెహ్లాట్‌కు చెక్‌ పెట్టేందుకే గవర్నర్‌‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌ రాజకీయం అనేక మలుపు తిరగుతోంది. కోర్టుల సచిన్‌పైలెట్‌కు ఫేవర్‌‌గా తీర్పు చెప్పడంతో అసెంబ్లీ సెషన్‌ నిర్వహించాలని, బలపరీక్ష జరపాలని సీఎం అశోక్‌ గెహ్లాట్‌ పలు సార్లు గవర్నర్‌‌ను కోరగా గవర్నర్‌‌ దానికి ఒప్పుకోలేదు.