పిజ్జా స్టోర్లో అగ్నిప్రమాదం..ఒక్కసారిగా ఎగిసిపడిన దట్టమైన పొగలు

పిజ్జా స్టోర్లో అగ్నిప్రమాదం..ఒక్కసారిగా ఎగిసిపడిన దట్టమైన పొగలు

గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్‌‌‌‌ సర్కిల్‌‌‌‌ పరిధిలోని హైదర్షాకోట్​లో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారిపై ఉన్న ఒక పిజ్జా స్టోర్‌‌‌‌ రెండో అంతస్తులోని కిచెన్‌‌‌‌ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు ఎగసిపడ్డాయి. దీంతో లోపల ఉన్న సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.