సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతోంది. లెజెండ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. 'జైలర్' మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ మెగా ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేస్తున్నారు., రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
హూ ఈజ్ ద హీరో?
రెండు నెలల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో నెట్టింట ఎలాంటి సునామీ సృష్టించిందో అందరికీ తెలిసిందే. అందులో రజనీ, కమల్ స్టైలిష్ రెట్రో లుక్స్‌లో కనిపిస్తూ.. "హూ ఈజ్ ద హీరో?" అంటూ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ వీడియోను ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ లెజెండ్స్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
క్రేజీ ప్రాజెక్ట్‌లోకి సౌత్ క్వీన్ ఎంట్రీ!
ఈ సినిమాలో నటించే తారాగణం గురించి రోజుకో క్రేజీ రూమర్ బయటకు వస్తోంది. లేటెస్ట్ గా సమాచారం ప్రకారం.. ఈ హిస్టారికల్ మల్టీస్టారర్‌లో ఒక పవర్‌ఫుల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ కోసం త్రిష ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దీనిపై చర్చలు జరుగుతుండగా, త్రిష కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సినీ వర్గాల్లో టాక్ వినిసిస్తోంది. ఈ మూవీ కోసం ఈ బ్యూటీకి రూ. 12 కోట్లు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం.
నిజానికి, త్రిష గత 22 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లను ఏలుతోంది. నిన్న సాయంత్రమే ( ఏప్రిల్ 10, 2016 ) ఆమె నటుడు సూర్యతో కలిసి నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'కరుప్పు' ట్రైలర్ రిలీజ్ అయి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ జోరులో రజనీ-కమల్ సినిమాలో లక్కీ ఛాన్స్ దక్కించుకోవడం త్రిష కెరీర్‌లోనే మైల్ స్టోన్ అని చెప్పాలి. గతంలో ఆమె కమల్ హాసన్‌తో కలిసి 'మన్మథన్ అంబు' (మన్మథ బాణం), 'తూంగా వనం' (చీకటి రాజ్యం), అలాగే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'థగ్ లైఫ్' సినిమాల్లో నటించింది. రజనీకాంత్‌తో కలిసి 'పేటా' సినిమాలో జోడీ కట్టింది.
రూ. 1000 కోట్ల టార్గెట్‌తో స్కెచ్!
ప్రస్తుతం డైరెక్టర్ నెల్సన్ ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతూ.. నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. రజనీకాంత్ మాస్ స్వాగ్, కమల్ హాసన్ యాక్టింగ్ క్లాస్, నెల్సన్ డార్క్ కామెడీ స్క్రీన్ ప్లే, అనిరుధ్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, తోడుగా త్రిష గ్లామర్.. ఇవన్నీ కలిస్తే థియేటర్లలో పూనకాలే అని అభిమానులు, మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్‌వైడ్‌గా రూ. 1000 కోట్ల కలెక్షన్ల మార్కును దాటే మొదటి తమిళ సినిమాగా ఈ ప్రాజెక్ట్ రికార్డు సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో పాటు అధికారిక ప్రకటన రానుంది.
