ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ నేపథ్యంలో సాగే న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ డ్రామా ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి దర్శకుడు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. ‘ఆజా మేరీ జాని’ అంటూ సాగే ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌ను దేవిశ్రీ ప్రసాద్ లాంచ్ చేసి, బెస్ట్ విషెస్ చెప్పారు. అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్‌లపై ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను కలర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్(ఆర్కాడొ) కంపోజ్ చేసిన ఈ పాటను బెన్నీ దయాల్ పాడారు.
కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ రాశారు. సాంగ్ రిలీజ్ సందర్భంగా నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘మేఘాలయ రాష్ట్రంలో పూర్తిగా చిత్రీకరణ జరిపిన తొలి దక్షిణాది సినిమా ఇది. ముఖ్యంగా చిరపుంజి వంటి అద్భుతమైన లొకేషన్స్‌లోనూ చిత్రీకరించాం. పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 9న రిలీజ్ చేయబోతున్నాం’ అని చెప్పారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
