అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా కొత్త దర్శకుడు ఉద్భవ్ రఘు రూపొందిస్తున్న చిత్రం ‘విసా : వింటారా సరదాగా’. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, శుక్రవారం సెకండ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రేమ, అమ్మాయిల వల్ల అబ్బాయిల జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి అశోక్ గల్లా తనదైన స్టైల్‌లో డైలాగ్స్ చెప్పడం ఆకట్టుకుంది.
‘అమ్మాయిలను ముట్టుకుంటే మసి.. పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి..’ అని ‘ఖలేజా’ చిత్రంలోని డైలాగ్‌ను రిఫరెన్స్‌గా వాడటం హైలైట్‌గా నిలిచింది. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు కీలక పాత్రల్లో కనిపించారు. విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దసరా కానుకగా అక్టోబర్ 17న సినిమా విడుదల కానుంది.
