నాకంటే షారుఖ్ బెటర్

నాకంటే షారుఖ్ బెటర్

పాత్ర పండటం కోసం ఏమైనా చేస్తాడని ఆమిర్‍ ఖాన్ ని పేరు.అయితే తను న్యాయం చేయలేననిపిస్తే ఆపాత్ర జోలికి పోడన్న విషయం ఇప్పుడు ప్రూవ్ అయ్యింది. ఆస్ట్రోనా ట్ రాకేష్ శర్మ బయోపిక్‍లో లీడ్‍ రోల్‍ చేయడానికి ఆమిర్‍ యాక్సెప్ట్ చేశాడు. అయితే అన్నీ ఓకే అనుకున్నాక సినిమా నుంచి డ్రాపయ్యాడు. ఆ స్థానంలోకి షారుఖ్ వచ్చాడు. టీమ్ తో ఏవోతేడాలు వచ్చాయని, ఏదో విషయంలో అతను ఇబ్బందిపడటం వల్లే ప్రాజెక్టు నుంచి వైదొలిగాడని రకరకాల వాదనలు వినిపించాయి. కానీ అవేవీ నిజం కాదని తేల్చేశాడు ఆమిర్‍. రాకేష్‍ పాత్రకి తాను సూట్‍ కానని, తనకంటే షారుఖ్‍ అయితే బాగా నప్పుతాడని అనిపిం చి తప్పుకున్నాడట.
పైగా షారుఖ్ కి ఫోన్‍ చేసి ఒకసారి ఆ స్క్రిప్ట్ వినమని, ఆ పాత్రకు నువ్వయితే బాగా నప్పుతావని చెప్పాడట కూడా. ‘షారుఖ్ కి
స్క్రిప్ట్ నచ్చడం, తను యాక్సెప్ట్ చేయడం నాకు సంతోషంగా ఉంది. ఆ పాత్రకి నాకంటే తనే బెటర్’ అన్నాడు ఆమిర్‌. అంత
గొప్ప హీరో తాను నప్పను అనుకోవడమే గ్రేట్‍ అంటే, మరో స్టా ర్ కి ఫోన్ చేసి నువ్వు నప్పుతావు అని ఇగో లేకుం డా చెప్పడం
ఇంకా గ్రేట్. నటనలోనే కాదు… బిహేవియర్ లోనూ ఆమిర్‍ మిస్టర్ పర్ క్టే!