హైదరాబాద్, వెలుగు : అబుదాబి సెంటర్ ఆఫ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌తో రామ్‌కీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్ (రీల్) కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టు పదేళ్లపాటు అమలులో ఉంటుందని రామ్‌కీ తెలిపింది. సస్టెయినబుల్ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌కు ఎకో పార్క్ ఏర్పాటుకు ఈ కాంట్రాక్టు వచ్చినట్లు పేర్కొంది. దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో ఈ ఎకో పార్క్ పెడుతున్నట్లు టాడ్‌వీర్ డైరెక్టర్ జనరల్ సలేమ్ అల్ కాబి తెలిపారు. ఇందులో భాగంగా ఉండే వేస్ట్ ట్రీట్‌మెంట్‌ను రామ్‌కీ ఎన్విరో, అల్ అహిలాలు పెట్టిన జాయింట్ వెంచర్ నిర్వహిస్తుందన్నారు. ఏడాదికి 7500 టన్నుల బయో మెడికల్ అండ్ హజార్డస్ వేస్ట్‌ను ట్రీట్ చేసే కెపాసిటీ ఎకో పార్క్‌కు ఉంటుందని రామ్‌కీ ఈ స్టేట్‌మెంట్లో తెలిపింది. టాడ్‌వీర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని రామ్‌కీ ఎన్విరో మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ రెడ్డి చెప్పారు. ఎకో పార్క్ యూఏఈలో తమ రెండో పెద్ద వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంటని తెలిపారు.
