విరాట పర్వం: దేశం ముందు ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది

విరాట పర్వం: దేశం ముందు ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది

హైదరాబాద్: టాలీవుడ్ హీరో, పాన్ ఇండియా స్టార్ దగ్గుబాటి రానా 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న విరాట పర్వం మూవీకి సంబంధించి ఓ వీడియోను చిత్ర యూనిట్ గ్లింప్స్ ఆఫ్ విరాట పర్వంగా విడుదల చేసింది. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో డాక్టర్ రవి శంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్నగా రానా మంచి ఇంటెన్సిటీతో కనిపించాడు. నక్సలైట్ బృందానికి లీడర్‌‌గా, వాళ్లకు శిక్షను ఇస్తున్న సీన్‌‌తో ఈ వీడియో స్టార్ట్ అయ్యింది.

‘ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది. సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది’ అనే మాటలు వీడియోలో కనిపించాయి. కాలేజీ యువకుడిగా, నక్సలైట్ నాయకుడిగా రానా ఆకట్టుకుంటున్నాడు. ఈ మూవీ చివరి షెడ్యూల్ హైదరాబాద్‌‌లో శరవేగంగా జరుపుకుంటోంది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేశ్‌‌బాబు నిర్మిస్తున్న ఈ మూవీని వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌‌‌గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్లు ప్రియమణి, నందితా దాస్ యాక్ట్ చేస్తున్నారు. వీరితోపాటు నివేతా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, రాహుల్ రామకృష్ణ, ఈశ్వరీ రావు, సాయి చంద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.