ఇరుముడి డబ్బింగ్ బిగిన్స్... షూటింగ్ చివరి దశలో..

ఇరుముడి డబ్బింగ్ బిగిన్స్... షూటింగ్ చివరి దశలో..

రవితేజ హీరోగా శివ నిర్వాణ  దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇరుముడి’.  తన షూటింగ్ పార్ట్‌‌‌‌ను పూర్తి చేసిన రవితేజ ఇప్పుడు  డబ్బింగ్ పనులను స్టార్ట్ చేశారు.   ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన డబ్బింగ్ స్టూడియో వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ఇందులో ‘నాకు ఒకే ఒక్క కూతురే... పేరు మనమ్మ’  అంటూ రవితేజ ఎంతో ఎమోషనల్‌‌‌‌గా చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  

ఆ ఒక్క డైలాగ్‌‌‌‌తోనే సినిమాలో తండ్రి-–కూతురు మధ్య ఉండే బలమైన అనుబంధాన్ని దర్శకుడు చూపించబోతున్నారని తెలుస్తోంది.  ఈ వీడియోలో బేబీ నక్షత్ర, దర్శకుడు శివ నిర్వాణ కూడా కనిపించారు.  ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా, కేవలం మూడు రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. 

మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తుండగా, సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్​ ఇందిర, స్వాసిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.