V6 News

డిజిటల్‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌ కోసం.. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కొత్త రూల్స్‌‌

డిజిటల్‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌ కోసం.. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కొత్త రూల్స్‌‌
  • రికరింగ్ పేమెంట్స్‌‌‌‌కు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కొత్త రూల్స్‌‌

న్యూఢిల్లీ: భారత రిజర్వ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ (ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ) డిజిటల్‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌ కోసం కొత్త ఎలక్ట్రానిక్ మ్యాండేట్‌‌‌‌ (ఈ–మ్యాండేట్‌‌‌‌) ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌ను ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తూ, గతంలోని అన్ని సర్క్యులర్లను రద్దు చేసి, కార్డులు, యూపీఐ, ప్రీపెయిడ్‌‌‌‌ పేమెంట్‌‌‌‌ ఇన్‌‌‌‌స్ట్రుమెంట్స్‌‌‌‌ (పీపీఐల)పై ఒకే విధమైన నియమాలను తీసుకొచ్చింది. ఈ–మ్యాండేట్‌‌‌‌ అంటే, యూజర్లు చేసే పునరావృత చెల్లింపుల (రికరింగ్‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌) కోసం ముందుగానే ఒకసారి అనుమతి ఇవ్వడం. 

ఉదాహరణకు, ప్రతి నెలా ఇన్సూరెన్స్‌‌‌‌ ప్రీమియం, మ్యూచువల్‌‌‌‌ ఫండ్‌‌‌‌ సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌, క్రెడిట్‌‌‌‌ కార్డ్‌‌‌‌ బిల్‌‌‌‌ లేదా ఓటీటీ సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌ చెల్లించాలి కదా. ప్రతిసారి ఓటీపీ లేదా పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌ ఇవ్వకుండా, ఒకసారి ఈ–మ్యాండేట్ రిజిస్టర్‌‌‌‌ చేస్తే, తర్వాతి చెల్లింపులు ఆటోమేటిక్‌‌‌‌గా జరుగుతాయి. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కొత్త ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌ ప్రకారం,  మొదటి చెల్లింపు సమయంలో అడిషనల్ ఫ్యాక్టర్‌‌‌‌‌‌‌‌ అథంటికేషన్  (ఓటీపీ/పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌) తప్పనిసరి. తర్వాతి చెల్లింపులు నిర్దిష్ట పరిమితిలో (రూ.15 వేల వరకు, కొన్ని కేటగిరీల్లో రూ.1 లక్ష వరకు) అథంటికేషన్  లేకుండా జరగొచ్చు.  ప్రతి ట్రాన్సాక్షన్‌‌‌‌కి 24 గంటల ముందు ప్రీడెబిట్‌‌‌‌ అలర్ట్‌‌‌‌ వస్తుంది. యూజర్లు  ఎప్పుడైనా మ్యాండేట్‌‌‌‌ను మార్చుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు.