న్యూఢిల్లీ: దేశంలో 500 రూపాయల నోట్ల చలామణి గణనీయంగా పెరిగినట్లు ఆర్‌బీఐ వార్షిక నివేదిక వెల్లడించింది. నకిలీ నోట్ల సంఖ్య కూడా 20 శాతం పెరిగింది. ఈసారి 1,41,907 నకిలీలను గుర్తించారు. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.500 నోట్ల పరిమాణం 11.2 శాతం పెరిగి 7,05,482 లక్షల పీసులకు చేరింది.
విలువ పరంగా చూస్తే ఇవి గత ఏడాది రూ.31.72 లక్షల కోట్ల నుంచి రూ.35.27 లక్షల కోట్లకు పెరిగాయి. మొత్తం చలామణిలో ఉన్న నోట్లలో వీటి వాటా 41.2 శాతం పెరిగింది. విలువ పరంగా వీటి వాటా 86 శాతంగా ఉంది.
రూ.2,000 నోట్ల ఉపసంహరణ కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి 98.45 శాతం నోట్లు తిరిగి వచ్చాయి. కొత్త నోట్ల ముద్రణ తగ్గడం వల్ల కరెన్సీ ప్రింటింగ్ ఖర్చు రూ.4,875 కోట్లకు తగ్గింది.
