సెంటర్ ఫర్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్ ప్రభుత్వ గుర్తింపు

సెంటర్ ఫర్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్  ప్రభుత్వ గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుల కోసం సెంటర్ ఫర్ స్పైన్ అండ్​ స్పోర్ట్స్ హెల్త్ (సీఎస్​ఎస్​హెచ్​)ను క్రీడా విజ్ఞాన, క్రీడా వైద్య కేంద్రంగా (స్పోర్ట్స్‌‌‌‌ సైన్స్‌‌‌‌-, స్పోర్ట్స్‌‌‌‌ మెడిసిన్‌‌‌‌)  ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. 

క్రీడాకారుల ఆరోగ్యం, ప్రదర్శనను మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్న భారతదేశపు మొట్టమొదటి టెక్- ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్‌‌‌‌డ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్​ మెడిసిన్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌గా ఈ గుర్తింపునకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని సెంటర్​తెలిపింది.  

రాష్ట్ర క్రీడాశాఖ కార్యదర్శి జయేశ్​రంజన్​ఈ సంస్థ అందిస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, బహుళ విభాగాల విధానాన్ని, స్పోర్ట్స్​ మెడిసిన్​ విధానాలను ప్రశంసించారు.