RC 15 న్యూజిలాండ్ షూట్ పూర్తి

RC 15 న్యూజిలాండ్ షూట్ పూర్తి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న చిత్రం RC 15 న్యూజిలాండ్ షూటింగ్ పూర్తియింది. ఈ విషయాన్ని స్వయానా రామ్ చరణే వెల్లడించారు. ఈ సందర్భంగా క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి కేక్ కట్ చేస్తున్న ఓ ఫొటోను షేర్ చేశారు. పది రోజుల పాటు జరిగిన ఈ సాంగ్ షూట్ కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని తెలుపుతూ న్యూజిలాండ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ సాంగ్, సాంగ్ లోని విజువల్స్ ఫ్యాబులస్ గా వచ్చాయని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. శంకర్ మేకింగ్, సినిమాటోగ్రాఫర్ తిరు విజువల్స్, బాస్కో మార్టిస్ ఖోరియోగ్రఫీ ఈ సాంగ్ ని మరింత స్పెషల్ గా మార్చాయన్నారు. కియారా అద్వానీ ఎప్పటిలాగే ఈ సారీ అద్భుతంగా ఉందని, ఇక తమన్ అయితే చించేశాడని రాసుకొచ్చారు. తన స్టైలిష్ లుక్స్ కి కారణమైన ఆలిమ్ హాకిమ్, మనీష్ మల్హోత్రాకి ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చెర్రీ థ్యాంక్స్ చెప్పారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ కొన్ని ఫొటోస్ ని కూడా షేర్ చేశారు. ఇందులో చరణ్ కొత్త హెయిర్ స్టైల్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ‘ఎల్లో టీషర్ట్’లో చరణ్ ‘మగధీర’ సినిమాలోని లుక్ ని గుర్తుకు తెస్తున్నాడు. ఈ ఫొటోలని రీట్వీట్ చేస్తూ మెగా అభిమానులు చరణ్ అల్ట్రా స్టైలిష్ గా ఉన్నాడంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.