పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 మంది రెబెల్ ఎంపీలు టీఎంసీని వీడి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ (NCP)లో చేరుతున్నట్లు ప్రకటించారు. సీనియర్ ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలోని ఈ రెబెల్ వర్గం జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)కి మద్దతు ప్రకటించింది. యూసుఫ్ పఠాన్, సాయాని ఘోష్, శత్రుఘ్న సిన్హా తదితరులు ఈ రెబెల్ వర్గంలో ఉన్నారు.
మొత్తం 20 మంది ఎంపీలు వేరు కుంపటి పెట్టి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ (NCP) లో విలీనం అయినట్లు ప్రకటించారు. ఈ బృందం NDA కి మద్దతు ఇస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ కూడా అందించింది. మొత్తం ఎంపీల్లో 2/3 వంతు మందికి పైగా రెబెల్స్ ఉండటంతో వీరిపై ఫిరాయింపుల నిరోధక చట్టం (Anti-Defection Law) వర్తించదని నిపుణులు భావిస్తున్నారు.
►ALSO READ | ఖాన్ సర్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. రోషన్ ఆనంద్ సోదరుడి మిస్టీరియస్ డెత్
కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశమైన కొన్ని గంటల తర్వాత ఈ తాజా రాజకీయ మలుపు పరిణామం చోటుచేసుకుంది. ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేయడంలో ఉన్న చట్టపరమైన చిక్కుల కారణంగా, తిరుగుబాటు తృణమూల్ ఎంపీలు NCPతో చేతులు కలపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
