Exports: ఎగుమతులు పెరిగాయ్.. 2026లో 421.32 బిలియన్ డాలర్ల సర్వీస్ ఎక్స్ పోర్ట్స్

Exports: ఎగుమతులు పెరిగాయ్.. 2026లో 421.32 బిలియన్ డాలర్ల సర్వీస్ ఎక్స్ పోర్ట్స్
  • ఎగుమతులు @ ఆల్​టైం హై!..రూ.35.39 లక్షల కోట్లు అంచనాలకు మించి నమోదు

న్యూఢిల్లీ: మనదేశ సేవల ఎగుమతుల విలువ 2026 ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగి 421.32 బిలియన్​ డాలర్లుగా (రూ.35.39 లక్షల కోట్లు) నమోదయింది. అంచనా వేసిన 418.31 బిలియన్​ డాలర్లు (రూ.35.13 లక్షల కోట్లు) కంటే ఇది ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో దేశ వస్తు సేవల ఎగుమతులు 863.11 బిలియన్​ డాలర్లు (రూ.72.50 లక్షల కోట్లు) ఆల్​టైమ్​ గరిష్ట స్థాయిని తాకినట్లు బుధవారం ఒక అధికారి తెలిపారు. 

సేవల ఎగుమతులు 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 8.71 శాతం పెరిగాయి. దేశ మొత్తం ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 4.59 శాతం వృద్ధి చెందాయి. పశ్చిమాసియాలో యుద్ధం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో పురోగతి ఈ వృద్ధికి కారణమైంది. 2026 ఆర్థిక సంవత్సరం ప్రతి క్వార్టర్లోనూ​ గరిష్ట  ఎగుమతులు రికార్డయ్యాయి.  

ఐటీ, బిజినెస్​ సొల్యూషన్స్​, వృత్తిపరమైన నైపుణ్యాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్​ దీనికి ప్రధాన బలం. వస్తువుల ఎగుమతులు 0.93 శాతం పెరిగి 441.78 బిలియన్​ డాలర్లకు (రూ.37.10 లక్షల కోట్లు) చేరాయి.