- రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చైర్మన్ బక్కి వెంకటయ్య
ట్యాంక్ బండ్, వెలుగు: కుల వివక్ష పాటిస్తున్న జనగామ జిల్లా కలెక్టర్‌పై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో కలెక్టర్ అనుమతితో పాలమాకుల చిన్న మంజుల అనే దళితురాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీ స్టాల్ ఏర్పాటు చేసుకుందని తెలిపారు. మహిళా పొదుపు సంఘం సహకారంతో రూ. 6 లక్షల రుణం తీసుకుని నడుపుతున్న ఈ స్టాల్‌ను ప్రస్తుత కలెక్టర్ బలవంతంగా తొలగించాలని పట్టుబట్టడం రాజ్యాంగ ఉల్లంఘనేనని ఆరోపించారు. దళితురాలిపై వివక్ష చూపుతున్న కలెక్టర్‌ను వెంటనే బదిలీ చేయాలని
విజ్ఞప్తి చేశారు.
