కేరళలో పర్వతం మధ్య చిక్కుకున్న యువకుడు

కేరళలో పర్వతం మధ్య చిక్కుకున్న యువకుడు

కేరళ, పాలక్కాడ్ సమీపంలోని మలప్పుజ ప్రాంతంలోని ఓ పర్వతం మధ్య చిక్కుకున్న యువకుడిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం పర్వతారోహణకు వెళ్లిన బాబు కిందకి జారి మధ్యలో చిక్కుకున్నాడు. అయితే అతడిని రక్షించేందుకు సహాయక బృందాలు ప్రయత్నాలు చేశాయి. కానీ ప్రయత్నాలన్ని విఫలమయ్యయి. దీంతో తీర ప్రాంత రక్షకదళం హెలికాఫ్టర్ ద్వారా యువకుడిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. బెంగుళూరు నుంచి ఓ ప్రత్యేకదళం పంపుతున్నట్లు సదరన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ సీఎంవోకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో వైపు బాబును రక్షించేందుకు NDRF దళం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.