V6 News

హస్తినాపురంలోని డిఫెన్స్ లిక్కర్ అమ్ముతున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి

 హస్తినాపురంలోని డిఫెన్స్ లిక్కర్ అమ్ముతున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి
  • రూ. 10 లక్షల విలువ చేసే 361 లిక్కర్ బాటిళ్లు లభ్యం

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో డిఫెన్స్​లిక్కర్​అమ్ముతున్న ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ఈఎస్ జీవన్ కిరణ్, సీఐ సుభాష్ చందర్, ఎస్సై అఖిల్ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున హస్తినాపురంలోని శ్రీ రమణ కాలనీ ఫేస్-2లోని ఒక ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. 

ఈ దాడుల్లో ఇంట్లో దాచిపెట్టిన 361 ప్రీమియం మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. నిందితుడు దొడ్ల సురేశ్ రెడ్డి  బెంగళూరు, హర్యానా డిఫెన్స్ క్యాంటీన్ల నుంచి ఖరీదైన ప్రీమియం లిక్కర్‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్ తీసుకువచ్చి బడాబాబులకు అమ్ముతున్నాడని గుర్తించారు. నిందితుడు  పరారయ్యాడని తెలిపారు.