రిటైర్డ్‌‌ న్యాయమూర్తికే పింఛన్‌‌‌‌ ఇవ్వట్లేదు : జస్టిస్‌‌‌‌ జి.శ్రీదేవి

రిటైర్డ్‌‌ న్యాయమూర్తికే పింఛన్‌‌‌‌ ఇవ్వట్లేదు : జస్టిస్‌‌‌‌ జి.శ్రీదేవి
  • హైకోర్టులో మాజీ జడ్జి జస్టిస్‌‌‌‌ శ్రీదేవి పిటిషన్‌‌‌‌
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు తాను రిటైర్డ్‌‌ అయ్యి మూడేండ్లు అవుతున్నా.. పెన్షన్‌‌‌‌ మంజూరు ప్రక్రియ చేపట్టలేదంటూ న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ జి.శ్రీదేవి అన్నారు. ఈ మేరకు హైకోర్టులో ఆమె పిటిషన్​ దాఖలు చేశారు. పిటిషన్​ను విచారించిన హైకోర్టు.. పెన్షన్‌‌‌‌ మంజూరు ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణకు అన్ని వివరాలివ్వాలని సూచించింది. 
 
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 అక్టోబర్‌‌‌‌లో జస్టిస్‌‌‌‌ శ్రీదేవి పదవీవిరమణ చేశారు. అయితే ఇప్పటికీ పెన్షన్‌‌‌‌ మంజూరు కాలేదంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను జస్టిస్‌‌‌‌ శామ్‌‌‌‌ కోశి, జస్టిస్‌‌‌‌ చలపతిరావు ధర్మాసనం శుక్రవారం విచారించింది. లాయర్‌‌‌‌ వాదిస్తూ, పెన్షన్‌‌‌‌ బకాయిలు, ఇతర ప్రయోజనాలను వడ్డీతో సహా చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. పింఛన్‌‌‌‌ మంజూరు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన కోర్టు విచారణను వాయిదా వేసింది.