ఇంగ్లండ్‌ కోచ్‌ కు సన్‌ రైజర్స్‌ బంపర్‌ ఆఫర్‌

ఇంగ్లండ్‌ కోచ్‌ కు సన్‌ రైజర్స్‌ బంపర్‌ ఆఫర్‌

ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్ కు కోచ్‌ గా సేవలందిస్తున్న ట్రెవర్‌ బేలిస్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రధాన కోచ్‌ గా నియమితులయ్యారు. ఈ మేరకు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ట్విటర్‌ లో ఈ విషయాన్ని తెలిపింది. ఏడు సీజన్ల పాటు సన్‌ రైజర్స్‌ కు సేవలందించిన టామ్‌ మూడీకి ధన్యవాదాలు తెలిపింది. ఇంగ్లండ్‌ విశ్వవిజేతగా నిలవడంతో ప్రధాన కోచ్‌ ట్రెవర్‌ బేలిస్‌ క్రేజ్‌ అమాంతం పెరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్‌ బేలిస్‌ శిక్షణలో ఇంగ్లండ్‌ ఫస్ట్ టైం ప్రపంచకప్‌ విజేతగా నిలవడంతో IPL ఫ్రాంచైజీలు అతడి కోసం పోటీపడ్డాయి. కోల్‌ కతా నైట్‌ ​రైడర్స్‌ కూడా బేలిస్‌ కోసం చివరి వరకు ప్రయత్నించింది. వచ్చే IPL సీజన్‌ లో తమ టీమ్ కు కోచ్‌ గా సేవలందించేందుకు బేలిస్‌ కు సన్‌ రైజర్స్‌ భారీ మొత్తంలో ఆఫర్‌ చేసినట్లు తెలిసింది.